సప్తసాగరాలు సప్తగిరులు రివ్యూ & రేటింగ్
విడుదల తేదీ: అక్టోబర్ 9, 2026
నటీనటులు: నివిన్ పౌలీ, అంజలి, సూరి తదితరులు
దర్శకుడు: రామ్
నిర్మాత: సురేష్ కామాచి
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రాఫర్: ఎన్.కె. ఏకాంబరం
ఎడిటర్: మతి వీఎస్
కథ:
ఎనిమిది వేల సంవత్సరాలకు పైగా జీవించిన ఓ అమరుడు (నివిన్ పౌలీ) రైలులో దుబాయ్ నుంచి తిరిగి వస్తున్న ఓ వ్యక్తి (సూరి)ని కలుస్తాడు. అనంతరం ఓ నిర్మానుష్యమైన రైలు కంపార్ట్మెంట్లో అతడిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాడు. అసలు ఆ అమరుడు ఎవరు? అతడు సూరిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు? అతడికి అమరత్వం ఎలా లభించింది? ఈ ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ. సినిమాలుచూడండి
విశ్లేషణ :
అమరుడైన వ్యక్తిని విచిత్రమైన ప్రవర్తనతో పరిచయం చేసే ప్రారంభ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు స్వల్పంగా నవ్విస్తాయి. నివిన్ పౌలీ తన పాత్రలో భిన్నంగా కనిపిస్తూ మెప్పించే ప్రయత్నం చేశారు. కథలోని పరిమితులు ఉన్నప్పటికీ ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇబ్బందుల్లో చిక్కుకున్న వ్యక్తిగా సూరి సహజంగా నటించగా, అంజలి కూడా తన పాత్రకు న్యాయం చేశారు.
యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. పరిమితమైన ప్రదేశంలోనే ఎక్కువ సన్నివేశాలు సాగినప్పటికీ సినిమాటోగ్రాఫర్ ఏకాంబరం కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ బాగుంది, దర్శకుడు రామ్ కథలో కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలను ప్రవేశపెట్టినా, వాటిని సమర్థవంతంగా కలిపి ప్రేక్షకులకు ఆసక్తికరమైన అనుభవాన్ని అందించడంలో ఎడిటర్ సక్సెస్ అయ్యాడు .
మొత్తంగా సప్తసాగరాలు సప్తగిరులు కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలు ప్రేక్షకులకు నచ్చుతాయి, బలమైన కథనం, ఏఐ విజువల్స్ వినియోగం, గ్రిప్పింగ్ క్లైమాక్స్ కారణంగా సినిమా ఆసక్తికరంగా ఉంది. నివిన్ పౌలీ, సూరి తమ నటనతో మెప్పించారు, ఇదొక కొత్త ప్రయత్నం, కొత్తదనం కోరుకొనే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండ నచ్చుతుంది.
రేటింగ్ : 3/5
TF
TeluguFilm.info
సూరి & నివిన్ పులె నటించిన సప్తసాగరాలు సప్తగిరులు అక్టోబర్ 9న థియేటర్స్ లో విడుదల !!!
నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో సప్తసాగరాలు సప్తగిరులు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
సప్తసాగరాలు సప్తగిరులు సినిమాను కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎం.సుబ్బారెడ్డి ఈ సినిమాను తెలుగులో గ్రాండ్ గా అక్టోబర్ 9న విడుదల చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది, ఇటీవల విడుదలైన మందాడి సినిమాతో సక్సెస్ సాధించిన సూరి అలాగే బెతలహెమ్ కుటుంబ యూనిట్ సినిమాతో సంచలన విజయం సాధించిన నివీన్ పులె ఈ సినిమాలో నటించడం విశేషం
రొమాంటిక్ సైకాలాజికల్ థ్రిల్లర్ నేపధ్యం లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తమిళ్ లో తంగ మీన్కల్, తారమణి, పెరంబు వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు, యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.
సంచారి పేరుతో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం సప్తసాగరాలు సప్తగిరులు పేరుతో అక్టోబర్ 9న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
TF
TeluguFilm.info
పెద్ద కలల వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న ఆర్నా ములర్
హైదరాబాద్‌కు చెందిన తెలుగు నటి ఆర్నా ములర్, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పాత్ర ఏదైనా, అందులో సహజత్వాన్ని చూపిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఇటీవల విడుదలైన ‘అగాధ’ చిత్రంలో తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్నా, అంతకుముందు ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’, ‘రజాకార్’, ‘దక్షిణ’ వంటి చిత్రాల్లోనూ నటించారు.
ప్రస్తుతం ‘మా ఊరి మల్లన్న’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తండ్రి–కూతురు మధ్య ఉన్న అనుబంధం, భావోద్వేగాలను ప్రధానంగా చూపించే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆర్నా పోషించిన పాత్ర కథలో కీలకంగా ఉండనుంది.
తెలుగు చిత్రాలతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టిన ఆర్నా, తన తొలి కన్నడ చిత్రానికి గాను ఇటీవల బెంగళూరులో జరిగిన చిత్ర సంతే ఫిల్మ్ అవార్డ్స్‌లో గుర్తింపు అందుకున్నారు.
నటనపై ఉన్న ఆసక్తి, కష్టపడే తత్వంతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఆర్నా ములర్, మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
“పెద్ద కలలు ఒక్కరోజులో నిజం కావు… ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగితే తప్పకుండా గమ్యం చేరుకోవచ్చు” అనే నమ్మకంతో ఆర్నా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
TF
TeluguFilm.info
సూరి & నివిన్ పులె నటించిన సంచారి అక్టోబర్ 1న గ్రాండ్ రిలీజ్ !!!
నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో 'సంచారి' పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.
సంచారి సినిమాను కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎం.సుబ్బారెడ్డి ఈ సినిమాను తెలుగులో గ్రాండ్ గా అక్టోబర్ 1న విడుదల చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది, ఇటీవల విడుదలైన మందాడి సినిమాతో సక్సెస్ సాధించిన సూరి అలాగే బెతలహెమ్ కుటుంబ యూనిట్ సినిమాతో సంచలన విజయం సాధించిన నివీన్ పులె ఈ సినిమాలో నటించడం విశేషం
రొమాంటిక్ సైకాలాజికల్ థ్రిల్లర్ నేపధ్యం లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తమిళ్ లో తంగ మీన్కల్, తారమణి, పెరంబు వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు, యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.